Home రాజకీయాలు నాకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదు.. నేను టీడీపీ పార్ట్‌నర్‌ ను కాను :...

నాకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదు.. నేను టీడీపీ పార్ట్‌నర్‌ ను కాను : పవన్ !

SHARE

ఓ పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోడే, అతనిని ఏమి అనవద్దు అని తన పార్టీ నేతలకు చెబుతుంటే మరో పక్క పవనేమో తెలుగుదేశం పార్టీకి నాకు ఎటువంటి సంభందం లేదని అంటున్నారు. హైదరాబాద్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో నాకు ఎటువంటి సంభందం లేదు. ఏదో పోయిన ఎన్నికల సమయంలో మద్దతు ఇచ్చానే తప్ప నేనేమి టీడీపీ పార్ట్‌నర్‌ ను కాను” అని అన్నారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో పవన్ కు సవాలు విసిరినా సంగతి మనకి తెలిసిందే. జగన్ సవాలుపై స్పందించిన పవన్ ” వైఎస్సార్‌సీపీనే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలి. అలా పెట్టినప్పుడే తెలుగుదేశం పార్టీ లైన్ ఏమిటి అనేది తెలుస్తుంది.

వైఎస్సార్‌సీపీ నిజంగానే కేంద్రంపై తీర్మానం పెడితే నేనే స్వయంగా ఢిల్లీకి వెళ్లి మరి అన్ని పార్టీలను ఇందుకు మద్దతు ఇవ్వమని కొరతా. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇదే ఆఖరిది కాబట్టి.. వచ్చే ఏడాది ఎన్నికలు కూడా జరగనున్నాయి కాబట్టి ఇవే ఆఖరి బడ్జెట్‌ సమావేశాలు కాబట్టి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇప్పుడే బలంగా పోరాడాలి. ఒకవేళ కేంద్రంపై వైసీపీ కానీ అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే అప్పుడు ఎలాగూ తెలుగుదేశం పార్టీనే పెడుతుంది కాదా. ఈ రెండు పార్టీలలో కేంద్రంపై ఎవరు ముందు అవిశ్వాస తీర్మానం పెడతారో అనే దానిపై ప్రజలతో పాటు నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను ” అని పవన్ పేర్కొన్నారు.