Home రాజకీయాలు ప్రశ్నించే పవన్ ఇప్పుడెందుకు ఇలా … ?

ప్రశ్నించే పవన్ ఇప్పుడెందుకు ఇలా … ?

SHARE

జనసీన్ అధినేత మరియు ప్రముఖ నటుడు అయిన పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు పెద్ద ఎత్తులో విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాలు చేయడానికి రెడీగా ఉండాలని ప్రకటించారు. మరల ఇప్పుడేమో ఎంపీలు రాజీవనామాలెందుకు ? అవిశ్వాస తీర్మానం పెట్టాలని పవన్ అంటున్నారు.

2016లో హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాలు చేయడానికి రెడీగా ఉండాలని ప్రకటించిన పవన్ ఇప్పుడు మాట మార్చి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరడంను బట్టి చూస్తుంటే నిజంగానే వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నట్లుగానే ఇది పవన్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శ నం అని మనం కూడా అనుకోవొచ్చు.

ఒక్కప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు పవన్ ధర్నాలకు మరియు నిరసనలకు దిగుతానని హెచ్చరించిన పవన్, ఇప్పుడెందుకు వెనక్కు తగ్గారు ? ప్రశ్నించడం కోసమే తమ పార్టీ అని చెప్పిన పవన్… ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలోని టీడీపీ అవినీతి పాలనను ఎందుకు ప్రశ్నించలేదు. ఈ నాలుగేళ్లు మౌనముగా ఉండిపోయిన పవన్… ఇప్పుడొచ్చి జేఎఫ్సీ పేరుతో ప్రజల ముందు హడావుడి చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే పవన్ కు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీలే ముఖ్యమని మనకి అర్ధమవుతుంది. చంద్రబాబుకి కానీ పవన్ కు కానీ కేంద్రంతో పోరాడే శక్తీ లేకనే ఇలా మాట మారుస్తూ ప్రతిదానికి రాజీపడుతూ వస్తున్నారు.