Home రాజకీయాలు ఎంపీలు సరిగా పనిచేయకపోవడం వలనే ప్రత్యేక హోదా రాలేదట !

ఎంపీలు సరిగా పనిచేయకపోవడం వలనే ప్రత్యేక హోదా రాలేదట !

326
SHARE

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించిన జేఎఫ్‌సీ 2 రోజుల మేధోమథన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎంపీలు సరిగ్గా పని చేయకపోవడం వలనే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. కేంద్రాన్ని నిలదీయడానికి ఎంపీ లు భయపడుతున్నారని, అసలు ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో తనకి అర్ధం కావడం లేదని అన్నారు. ఇలాంటి తప్పులు ఇంకోసారి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఏ చేయాలనే ఆలోచనావిధానంతో తాము ముందుకు వెళ్తున్నామని, తమకు ఇదే తోలి మెట్టు అని పవన్ అన్నారు.

ఎంపీలు యూపీఏ హయాంలో సరిగా స్పందించలేకపోయారు. అందుకే వారు ఈ సమస్యను కేంద్రం దృష్టికి సమర్థమవంతంగా తీసుకెళ్లలేదు. వారికున్న ఆశలు, వ్యక్తిగత సమస్యల వల్ల వారికీ ఎక్కడా అవకాశాలు దక్కవేమో అనే భయంతో ఎంపీలెవరూ కేంద్రంతో ఎదిరించి మాట్లాడే సాహసం చేయలేదు. అందుకే అప్పుడు యూపీఏలో అదే జరిగింది. ఇప్పుడు కూడా ఎన్డీయే ప్రభుత్వ హయాంలోనూ అదే జరుగుతోంది అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అయితే పవన్ ఇదంతా ఎంపీల వలనే జరిగిందని అంటున్నారు కానీ, ఆయా పార్టీ అధినేతలను మాత్రం ఏమి అనడం లేదు. ఎంపీలెవరూ కేంద్రంతో ఎదిరించి మాట్లాడడం లేదని అంటున్నారు.. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా కేంద్రానికి ఎదిరించి మాట్లాడడం లేదు మరి అతనిని పవన్ ఎందుకు ఏమి అనడం లేదు ? ప్రజలకు ఎంపీలు ఎందుకు భయపడుతున్నారో అని కాదు ముఖ్యమంత్రి కేంద్రానికి ఎందుకు భయపడుతున్నాడో అనేది అర్ధం కావడం లేదు. అసలు చంద్రబాబుని ప్రశ్నించడానికి పవన్ ఎందుకు భయపడుతున్నాడో ? మరి.