Home రాజకీయాలు సౌత్ లో బీజేపీ కథ ఇక ముగిసినట్లేనా ?

సౌత్ లో బీజేపీ కథ ఇక ముగిసినట్లేనా ?

672
SHARE

కేంద్రం ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి ప‌లు నిర్ణ‌యాల వలన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ విషయంలో కూడా అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలకే తీవ్ర అన్యాయం జరిగింది. దీనితో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు బీజేపీ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విభజన చేసినా కూడా కాంగ్రెస్ పార్టీనే బీజేపీ కంటే నయమని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. దీనితో తెలుగురాష్ట్రాల్లో ఇక బీజేపీ కథ ముగిసినట్లే అని అందరూ అనుకుంటున్నారు.

దీనితో మోడీ సర్కార్ త‌మిళ‌నాడులో పాగా వేయాల‌ని వ్యూహాలు రచించినా కూడా ప్రయోజనం ఉండేలా ఏమి కనపడటం లేదు. ఎందుకంటె హీరోలు క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ లు ఇత‌ర పార్టీలేవి రాష్ట్రంలోకి రాకూడ‌దు అనే ఉద్దేశంతోనే వారే సొంతగా కొత్త పార్టీలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ వీరిద్దరూ కానీ కలిస్తే తమిళనాట కూడా బీజేపీ కనుమరుగైపోవడం ఖాయం.

కర్ణాటకలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అరవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంది. ఇక కేరళ విషయానికొస్తే అక్కడ ఎర్ర జెండాల‌ను కింద‌కు దించ‌డం అంటే మాములు విషయం కాదు. అక్కడ బీజేపీకి తీవ్రమైన వ్యతిరేఖత ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గతంలో ఏదో టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఏదో కొంచెం అక్కడ బీజేపీ తన ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌ధ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ ల పొత్తు ఉండేలా ఏ మాత్రం కనపడడం లేదు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ క‌థ క్లైమాక్స్ కు చేరినట్లే.