Home సినిమా అందరిలో రకుల్ ని ఎత్తేశాడు !

అందరిలో రకుల్ ని ఎత్తేశాడు !

SHARE

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్‌లో అయ్యారీ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కానీ హిట్ అయితే రకుల్ బాలీవుడ్ లో మరల పాగా వేయొచ్చు. అందుకే రకుల్ ఈ సినిమా ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. కాగా, ఈ సినిమా ప్రమోషన్‌ సమయంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడీ ఘటన వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా రకుల్ తో కలిసి ప్రమోషన్‌లలో పాల్గొన్నారు. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి ఢిల్లీలోని ఎస్ ఆర్ సీసీ కళాశాలకు వెళ్లారు. అక్కడ ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈ జంటను డాన్స్‌ చేయామని కోరారు. దీనితో సిద్ధార్థ్-రకుల్ కలిసి ” లేయ్ డూబా” పాటకు డ్యాన్స్ చేశారు. ఈ పాటలో భాగంగా సిద్ధార్థ్ , రకుల్ ని అమాంతం ఎత్తుకోవటంతో అక్కడున్న విద్యార్థులంతా కేకలు వేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.