Home రాజకీయాలు మంత్రి గంటా ముందు జ్యోతిలక్ష్మి డ్యాన్స్‌లు

మంత్రి గంటా ముందు జ్యోతిలక్ష్మి డ్యాన్స్‌లు

562
SHARE

విద్యాశాఖ తీరు మరోసారి వివాదాస్పమైంది. విశాఖలో జరుగుతున్న సైన్స్‌ ఫెయిర్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినులతో అధికారులు వేయించిన డ్యాన్స్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మంత్రి గంటా సమక్షంలోనే సాగిన ఈ తంతు చూసి మహిళలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సైన్స్‌ ఫెయిర్‌కు మంత్రి వచ్చిన సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే సాంప్రదాయ నృత్యాలు కాకుండా పిల్లలతో క్లబ్‌ డ్యాన్స్‌లు చేయించారు. జ్యోతిలక్ష్మీ పాటలకు చిన్నారులతో ప్టెప్పులేయించారు. మంత్రి గంటాను ఆనందింపచేసేందుకు అధికారులు ప్రయత్నించారు.

నీ ఇల్లు బంగారం కాను.. నా ఒళ్లు సింగారం గాను అన్న పాటలకు విద్యార్థినులతో గ్రూప్ డ్యాన్స్ వేయించారు. మంత్రి గంటా కాళ్ల వద్ద విద్యార్థినులు డ్యాన్స్‌లు వేయడం చూసి కార్యక్రమానికి వచ్చిన వారు దిగ్బ్రాంతి చెందారు.

మంత్రి గంటా మాత్రం ఇలాంటి అసభ్య నృత్యాలను ఎందుకు చేయిస్తున్నారని ఒక్క మాట కూడా అనలేదు. అమ్మాయిలు డ్యాన్స్‌లు వేస్తుంటే మంత్రిగారు దర్జాగా కూర్చున్నారు. ఒక లైలా కోసం తిరిగాను లోకం అంటూ ఆ లైప్‌ పాటలతోనే కార్యక్రమం నిర్వహించారు అధికారులు. తాను ఎలాంటి పాటలకు డ్యాన్స్ లు వేస్తున్నామో కూడా తెలుసుకోని పిల్లలతో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ కు డ్యాన్సులు వేయించడంపై అధికారులు మాత్రం నోరు విప్పడం లేదు.