Home రాజకీయాలు లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ లో మరో కొత్త ట్విస్ట్ !

లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ లో మరో కొత్త ట్విస్ట్ !

1386
SHARE

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి మన అందరికి తెలిసిందే. ఆయన ఏదైనా సర్వే చేస్తే చాలు అది కచ్చితంగా నిజమే అవుతుంది. అందుకే ఆయన తన సర్వేలతో ఆంధ్రా ఆక్టోప‌స్ గా పేరు సంపాదించుకున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జన తరువాత లగడపాటి ఆయనిచ్చిన మాట ప్ర్రకారం రాజకీయ సన్యాసంను తీసుకున్నారు.

కాగా. లగడపాటికి రాజకీయపరంగా ఎంతో మంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వారందరు లగడపాటి మరల రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇటీవల ల‌గ‌డ‌పాటి పుట్టిన రోజు వేడుక సంద‌ర్భంగా ఆయన అభిమానులందరూ లగడపాటిని రాజకీయాల్లోకి రావాలని పెద్ద ఎత్తున ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో లగడపాటి ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంపై లగడపాటి టీడీపీలోకే ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ, లగడపాటి రాజకీయ ఎంట్రీ విషయంలో ఇప్పుడు మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. జనసేన కార్యకర్తలు లగడపాటి పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో పెద్ద ఎత్తున ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనితో లగడపాటి జనసేన పార్టీలోకి వెళ్తారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో మాత్రం బీజేపీ- టీడీపీ పొత్తు ఉండ‌ద‌నే విషయం మన అందరికి తెలిసిందే. దాంతో జనసేన-టీడీపీ ల కూటమి తెరపైకి వచ్చే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. దీనితో లగడపాటి కూడా జనసేన పార్టీ తరపునే ఎంపీగా పోటీ చెయ్యడానికి రెడీగా ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. అయితే లగడపాటి మనసులో ఏముందో అనేది మాత్రం తెలియాలంటే లగ‌డ‌పాటినే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంపై అధికారికంగా చెప్పాల్సిందే.