Home రాజకీయాలు సింపుల్ గా ఇరికించేశారే!

సింపుల్ గా ఇరికించేశారే!

6572
SHARE

ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. తాము అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అని ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఇక తన పార్టనర్‌ అయిన చంద్రబాబును పవన్ కల్యాణ్‌ ఒప్పించుకోలని డిమాండ్ చేశారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలంటే తీర్మానాన్ని 54 మంది ఎంపీలు బలపరచాల్సి ఉంటుందని చెప్పారు. తమ పార్టీ నుంచి మిగిలిన ఐదుగురు ఎంపీలు అందుకు సిద్ధమన్నారు.

టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీ నుంచి చంద్రబాబు కొనుగోలు చేసిన ఎంపీలతో అందుకు మద్దతు ఇప్పించాలని పవన్‌కు జగన్‌ సూచించారు. అవిశ్వాసం తాము పెట్టేందుకైనా సిద్ధం.. ఒకవేళ పవన్‌ కల్యాణ్ పార్టనర్‌ అయిన టీడీపీ పెట్టినా మద్దతు ఇచ్చేందుకు తాము సిద్దమని జగన్ ప్రకటించారు. కేంద్రం ఎంతిచ్చింది.. రాష్ట్రం ఏం చేసిందంటూ కోడిగుడ్డుపై ఈకలు పీకడం పవన్‌ మానుకుని.. ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలని జగన్‌ పిలుపునిచ్చారు.

నాలుగేళ్లుగా ప్రతి బడ్జెట్‌ తర్వాత కేంద్రాన్ని చంద్రబాబు పొగుడుతూ వచ్చారని.. ఎన్నికలు వస్తుండడంతో ఇప్పుడు డ్రామాలాడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని అన్యాయం జరుగుతోందని తాము పదేపదే చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఏ రాష్ట్రమైనా ఇంతకన్నా ఎక్కువ సాధించిందా సాధించి ఉంటే చూపండి అంటూ ప్రతిపక్షాలకు సవాల్ చేశారని గుర్తు చేశారు.

ఇప్పుడు మాత్రం కొత్త డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు జగన్‌. మొత్తం మీద మొన్నటి వరకు ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చిన పవన్ కల్యాణ్.. వైసీపీ ఎంపీలు రాజీనామాకుసిద్ధపడగానే అవిశ్వాసం పెట్టాలంటూ కొత్త పల్లవి ఎత్తారు. ఇప్పుడు అందుకు కూడా తాము సిద్ధమని జగన్ ప్రకటించిన నేపథ్యంలో.. అవిశ్వాసంపై పార్టనర్‌ చంద్రబాబును పవన్‌ ఒప్పిస్తారో లేదో చూడాలి.