Home రాజకీయాలు హరిబాబుపైకి దూసుకెళ్లిన లక్ష్మీపతి.. మధ్యలోనే కామినేని జంప్

హరిబాబుపైకి దూసుకెళ్లిన లక్ష్మీపతి.. మధ్యలోనే కామినేని జంప్

4200
SHARE

ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందంటూ నాలుగేళ్ల తర్వాత టీడీపీ ఏకపక్షంగా చేస్తున్న దాడిపై ఏపీ బీజేపీ ఇప్పుడు తర్జనభర్జన పడుతోంది. ఏపీ బీజేపీలోని కొందరు కీలక నేతల సాయంతో చంద్రబాబు.. బీజేపీ ఎదగకుండా తొక్కేస్తూ వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్‌ లాంటి వారంతా పార్టీ శ్రేయస్సు కంటే చంద్రబాబు మంచి కోసమే ఎక్కువ తపిస్తుటారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆదివారం విజయవాడలో బీజేపీ అంతర్గత సమావేశం జరిగింది.

ఈసమావేశంలోకొందరు బీజేపీ నేతల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఏపీలో బీజేపీని సొంత పార్టీ నేతలే దెబ్బతీశారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజు ఏకంగా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుపై సమావేశంలో విరుచుకుపడ్డారు.

తనస్థానం నుంచి లేచి హరిబాబు వైపు వెళ్లారు. టీడీపీని ఇంతకాలం కట్టడి చేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కాకుండా కొందరు బీజేపీ నేతలు పార్టీని తప్పుదారిపట్టించారంటూ హరిబాబుపై విరుచుకుపడ్డారు. దీంతో హరిబాబుకు కోపం వచ్చింది. ఇద్దరూ కాసేపు పరస్సరం దూషించుకున్నారు.

ఇంతలో మంత్రి మాణిక్యాలరావు, పురందేశ్వరి తదితరులు జోక్యం చేసుకుని లక్ష్మీపతిరాజును శాంతింపజేశారు. ఇతర నేతలు కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్‌లోని మంత్రుల చేత రాజీనామా చేయించాలని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన మాణిక్యాలరావు.. పార్టీ ఓకే అంటే ఐదు నిమిషాల్లో రాజీనామా ఇచ్చివస్తానని ప్రకటించారు.

అధ్యకుడు హరిబాబు మాత్రం దూకుడు వద్దని.. నెమ్మదిగా వెళ్దామనిసూచించగా… విష్ణుకుమార్‌ రాజు, మాణిక్యాలరావు అంగీకరించలేదు. ఇక ఆలోచించడాలు వద్దు… గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

వారి వాదనతో ఇతర నేతలు అంగీకరించారు. దీంతో మంత్రులు కామినేని, మాణిక్యాలరావు ఇద్దరూ రాజీనామాలు ఇవ్వాల్సిందిగా సమావేశం తీర్మానించింది. అయితే తొలి నుంచి చంద్రబాబుతోనే చాలాసన్నిహితంగా ఉంటున్న మంత్రి కామినేని మాత్రం ఆ సమయంలో అక్కడ లేరు. సమావేశం ప్రారంభమైన అరగంటకే ఆయన అక్కడి నుంచి జంప్‌ అయ్యారు. దీని బట్టి కామినేని బీజేపీ నిర్ణయానికి కట్టుబడి రాజీనామాలు చేసే పరిస్థితి లేదన్న భావన వ్యక్తమవుతోంది.