Home రాజకీయాలు 2సి లోకేష్ ఫై టీడీపీ మంత్రులు గరం గరం !

2సి లోకేష్ ఫై టీడీపీ మంత్రులు గరం గరం !

234
SHARE

ప్రస్తుత ఏపీ గ్రామీణాభివృద్ధి – పంచాయతీ రాజ్ శాఖను కొడుకు చేతిలో పెట్టిన తర్వాత.. ఆ శాఖలో పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి అని చంద్రబాబు తెగ ఆనందంలో మునిగిపోతున్నారు. పైగా తన ప్రియా పుత్రుడు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని బాగా సంబరపడి పోతున్నాడు . ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏయే శాఖలు ఎలా పనిచేశాయో కూడా ఈ సందర్భంగా ఓసారి గుర్తు చేశారు చంద్రబాబు.

కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకున్న శాఖలను ఆయన అభినందించారు. అలాగే తన కొడుకు నారా లోకేష్ పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ అమోఘమైన పనితీరుతో – నిధుల వ్యయంతో అనేక పురస్కారాలు దక్కించుకున్నదని కూడా ఆయన కితాబులు ఇచ్చేశారు.

ఇలా చంద్రబాబు తన కొడుకు నిర్వహిస్తున్న పని కార్యక్రమాల గురించి తెలుసుకొని ,తన కొడుకు కంటే సీనియర్ మంత్రుల కంటే తన కొడుకు నిర్వహించే శాఖకు అధిక మొత్తంలో ప్రజలనుండి మంచి స్పందన వస్తున్నదని భావిస్తున్నాడు . అవును మరి.. అచ్చంగా నూటికి నూరుశాతం నిధులు కేంద్రం నుంచి నిరంతరాయంగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశం ఉన్న గ్రామీణాభివృద్ధి – పంచాయతీ రాజ్ శాఖను కొడుకు చేతిలో పెట్టిన తర్వాత..

ఆ శాఖలో పనులు జరగకుండా ఎందుకుంటాయ్ అని పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారట. అవును మరి గోమాతలంటి శాఖను తన పుత్రుడు దగ్గర ఉంచటంవల్లే ఈవిధంగా పనులు పెదవి విరుస్తున్నారు . ఐతే ఇదిఅంతా తన కొడుకు భవిష్యత్తు కోసమేనని అంతే కాకుండా 2019 ఎన్నికలలో తన కొడుకును టీడీపీ పార్టీ తరుపున ముఖ్యమంత్రిగా ప్రకటించటానికి ఇలా చేస్తున్నాడని పలువురి ప్రముఖుల భావన.