Home రాజకీయాలు జగన్ గళం విప్పెరా, జనం కదం తొక్కెరా! ప్రజాసంకల్ప యాత్ర..

జగన్ గళం విప్పెరా, జనం కదం తొక్కెరా! ప్రజాసంకల్ప యాత్ర..

273
SHARE

జననేత అని వూరికే అనలేదు, ఆయన ఎక్కడున్నా ప్రజలు వెంటే నడుస్తున్నారు. జగన్ గళం విప్పెరా, జనం కదం తొక్కెరా! ఈ రోజు పాదయాత్రలో భాగంగా సెల్ఫీలు మరియు ఆటోగ్రాఫ్ లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు కందుకూరు ప్రజలు.

90వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లా వాలేటివారి పాలెం చేరుకుంది. గ్రామస్తులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి వారి సమస్యలను ఒక్కొక్కటిగా చెప్పుకున్నారు. రైతులు, రైతు కూలీలు, యువత, మహిళలు, అవ్వాతాతలు, వివిధ ప్రజాసంఘాలు వారి వారి సమస్యలను తెలియజేస్తున్నారు.

గ్రామగ్రామాన ప్రజలు అశేష సంఖ్యలో కదలివచ్చి ఘనస్వాగతం పలుకుతుండడం ఉత్సాహాన్నిస్తోంది. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. భరోసానిస్తూ పాదయాత్ర ముందుకుసాగుతోంది.