Home సినిమా ప్రముఖ నటి అయిన జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు !

ప్రముఖ నటి అయిన జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు !

SHARE

ప్రముఖ నటి, హీరో సూర్య భార్య అయిన జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం తమిళనాట విడుదలైనా ” నాచ్చియార్‌” అనే సినిమాలోని కొన్ని సంభాషణలపై హిందూ మక్కల్‌ కట్చి సంస్థ అభ్యంతరం తెలుపుతూ ఆ సినిమా దర్శకుడిపైనా మరియు నటి జ్యోతికపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సినిమాలోని కొన్ని సంభాషణలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ శుక్రవారం ఆ సంస్థ సభ్యుడు కాళికుమార్‌ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జ్యోతిక హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా ఓ డైలాగ్ చెబుతుంది. ఆ డైలాగ్ ను సినిమా నుండి వెంటనే తొలంగించాలని… ఈ డైలాగ్ వలన మతపరమైన సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ సినిమా దర్శకుడు అయిన బాలా మరియు హీరోయిన్ జ్యోతికలపై తగిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కోరారు.