ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మరియు జనసేన ఎవరికి వారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ఢీ కొట్టడానికి నువ్వా-నేనా అన్నట్లుగా ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ లు రాజీనామాల పర్వానికి తెరలేపాయి. ఇక జనసేననేమో జేఎఫ్ ఎఫ్ సీ అంటూ హడావిడి చేస్తున్నారు.
కాగా, పవన్ జేఎఫ్ ఎఫ్ సీ వెనుక ఓ మాస్టర్ ప్లానే ఉందట. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ – జనసేన మూడు పార్టీలు కలిసినా కూడా వైసీపీ స్వల్ప ఓట్లతోనే అధికారాన్ని కోల్పోయింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కూడా టీడీపీకి పెద్ద ఉపయోగమేమి ఉండదు.
దీనితో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక వ్యూహాన్ని రచించారు. ఇందులో భాగంగానే పవన్ ను బాబు రంగంలోకి దింపారు. పవన్ కూడా టీడీపీని కాపాడేందుకు చంద్రబాబు చెప్పినట్లుగానే జేఎఫ్ ఎఫ్సీ అనే ప్లాన్ ను అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మేధావులను, నాయకులను కూడా జేఎఫ్ ఎఫ్సీ లోకి కలుపుకున్నారు.
టీడీపీకి ఉండే వ్యతిరేఖ ఓట్లు వైసీపీకి పడకుండా వాటిని కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి చేర్చేందుకే చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇలా ప్లాన్ చేశారని అనుమానించడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వచ్చే ఎన్నికల్లో టీడీపీని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేక వైసీపీ అధినేత జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్రం మొహాన విసిరి వేస్తానంటున్నా జగన్ రాజకీయ వ్యూహం ఫలిస్తుందా ? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.