Home రాజకీయాలు అంబానీ అమరావతి రావడం వెనుక చీకటి ఒప్పందం కుదిరిందా ?

అంబానీ అమరావతి రావడం వెనుక చీకటి ఒప్పందం కుదిరిందా ?

264
SHARE

మంగళవారం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అమరావతి రాకపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తన బిజినెస్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే అంబానీ ఇంత అకస్మాత్తుగా అమరావతికి ఎందుకొచ్చినట్లు ? అసలు అంబానీ చంద్రబాబుని కలిసి ఏమి చర్చించినట్లు ? ఇప్పుడాన్ని రాజకీయపార్టీలలో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, మీడియానేమో రాష్ట్రంలో పెట్టుబడుల వోషయం గురించే అంబానీ, చంద్రబాబుతో చర్చించారని, జియో ఫోన్ల పరిశ్రమను తిరుపతిలోస్థాపిస్తారని, ఇతర పరిశ్రమలు కూడా పెడతారని ప్రకటిస్తుంది.

అయితే అంబానీ అమరావతి రావడం వెనుక భిన్న‌మైన‌ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంబానీ అమరావతికి వచ్చింది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం కాదని, ఆయన వేరే రాజకీయ కారణాలతోనే అమరావతికి వచ్చారని కొంతమంది రాజకీయ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికే అంబానీ అమరావతికి వస్తే చంద్రబాబుతో అన్ని గంటలు ఎందుకు గడిపారు ? అంత అవసరం అంబానీకి ఏముంది ?

అంబానీ కేంద్రంలో మారిన రాజకీయ పరిస్థితులపై మోడీ తరపున చంద్రబాబుతో మాట్లాడటానికి వచ్చారు. మోడీనే అంబానీని రాయబారిగా పంపారంటూ కొంతమంది రాజకీయ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. వీటికి తోడు చంద్రబాబు సేవలు పెద్ద స్థాయిలో ఉండాలని అంబానీ వ్యాఖ్యానించడంతో ఈ ఊహాగానాలకు ఇంకొంచెం రెక్కలొచ్చినట్లు అయింది.

అంతేకాకుండా రిల‌య‌న్స్ సంస్ధ‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను చూసుకుంటున్న మాధ‌వ‌రావుకి ఈ సారి ఎలా అయిన రాజ్య‌స‌భ టికెట్ ఇవ్వాల‌ని చంద్రబాబుని, అంబానీ సిఫార్స్ చేసిన‌ట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు మరియు అంబానీల భేటీ వెనుక ఏవో కీలకమైన రాజకీయ అంశాలు దాగి ఉన్నాయని చాలామంది చర్చించుకుంటున్నారు.