Home రాజకీయాలు ప్రకాశం జిల్లాలో జగన్ పన్నిన రాజకీయ వ్యూహం ఇదేనా ?

ప్రకాశం జిల్లాలో జగన్ పన్నిన రాజకీయ వ్యూహం ఇదేనా ?

SHARE

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. ప్రకాశం జిల్లా జగన్ కు ఎంతో కీలకమైనది. ఎందుకంటె గత ఎన్నికల్లో ఈ జిల్లా మొత్తం 12 స్థానాలు ఉండగా 6 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీరిలో నలుగురు ఎమ్మెల్యే లు పార్టీని ఫిరాయించి వైసీపీ కి పెద్ద షాక్ ఇచ్చారు.

దీనితో ప్రకాశం జిల్లాలోని వైసీపీ కార్యకర్తలను ముందుకు నడిపేందుకు నాయకుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీని ముందుకు తీసుకోని వెళ్లాలంటే బలమైన నాయకత్వం కావాలి. అందుకు జగన్ ఓ వ్యూహాన్ని రచించారు. అక్కడ స్థానికంగా ఉండే నాయకులనే బలంగా తయారు చేయాలనీ, అక్కడున్న ఇతర పార్టీ నాయకులను వైసీపీ లోకి వ‌చ్చేలా జగన్ తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

అంతేకాకుండా అక్కడి బూచెప‌ల్లి కుటుంబాం వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించింది. ఎలా అయినా యాక్టీవ్ పాలిటిక్స్ లోకి బూచెప‌ల్లి కుటుంబాన్ని తీసుకురావాలని జగన్ అనుకుంటున్నారు. వైసీపీ సీనియర్ నేతలు అయిన వైవీ సుబ్బా రెడ్డి, బాలినేనిలు ప్రకాశం జిల్లాకు చెందినవారే.