Home సినిమా రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు సిద్దమైన రంగం !

రాంగోపాల్‌ వర్మ అరెస్ట్‌కు సిద్దమైన రంగం !

SHARE

సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి, ప్రముఖ దర్శక, నిర్మాత అయిన రాంగోపాల్‌ వర్మ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు లో ” రాంగోపాల్‌ వర్మ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో తనని అవమానించారంటూ” దేవి తెలిపింది. వర్మ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకుగాను వర్మపై చట్టపరంగా తగిన చర్యలను తీసుకోవాలని… వర్మ తన గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ సినిమాను ఎవరైనా అడ్డుకుంటే వారిని కొడతానంటూ… బెదిరిస్తున్నారని ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.

రాంగోపాల్‌ వర్మపై దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్‌ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కాగా, ఇటీవల జరిగిన ఓ టీవీ చర్చాక్రమంలో వర్మ భూతు సినిమాలను తీస్తూ సమాజాన్ని చెడకొడుతున్నారని దేవి వర్మను విమర్శించారు. వర్మ తన సినిమాలలో మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ… వారిని అంగడి సరుకుగా మార్చేస్తున్నారని దేవి, వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

దేవి చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ … “దేవి చాలా చెత్తగా ఆలోచిస్తారని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఆమె ప్రతినిథి అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తారని” అన్నారు. గతంలో కూడా వీరిద్దరూ పలు సందర్భాల్లో పలు టీవీ చర్చల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి మనకి తెలిసిందే.