Home రాజకీయాలు జేఎఫ్‌సీలో కీలక వ్యక్తుల మధ్య విబేధాలు

జేఎఫ్‌సీలో కీలక వ్యక్తుల మధ్య విబేధాలు

SHARE

పవన్ కల్యాణ్ జేఎఫ్‌సీలో విబేధాలు పొడచూపాయి. తొలి సమావేశంలోనే కీలక వ్యక్తులు భిన్న వాదనలు వినిపించారు. తొలిసమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన లోక్‌సత్తా జేపీ… ఇచ్చిన నిధులకు కేంద్రం రాష్ట్రాన్ని లెక్కలడగడాన్ని తప్పుపట్టారు.

చంద్రబాబు వాదనను సమర్ధించారు. కేంద్రం నిధులు ఇవ్వడం వరకే బాధ్యత.. వాటిని ఎలా వాడుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమన్నారు. కేంద్రం తామిచ్చిన నిధులకు లెక్కలు అడగడాన్ని జేఎఫ్‌సీ ఖండిస్తోందని మీడియా సాక్షిగా జేపీ చెప్పారు.

లెక్కలు అడగడం సమాఖ్యస్పూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అయితే సమావేశానికి హాజరైన మాజీ సీఎస్ ఐవైఆర్‌ కృష్ణారావు… జేపీ వ్యాఖ్యాలతో విబేధించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కలు చూపాల్సిందేనన్నారు.

కేంద్రం నిధులను నిర్దేషిత కార్యక్రమాల కోసం ఇచ్చినప్పుడు వాటిని అక్కడ ఖర్చు పెట్టారో లేదో తేలియజేయాల్సి ఉంటుందన్నారు. కాబట్టి కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపాల్సిందేనంటూ జేపీ వ్యాఖ్యలను తోసిపుచ్చారు ఐవైఆర్‌.

జేఎఫ్‌సీలో కీలక వ్యక్తుల మధ్య విబేధాల నేపథ్యంలో పవన్‌ ఎవరి వాదనను సమర్ధిస్తారో చూడాలి. జేపీ వాదనవైపే నిలిచి చంద్రబాబుకు అండగా ఉంచారేమో వేచిచూడాలి.