Home రాజకీయాలు పవన్ కళ్యాణా.. అతను ఎవరో కూడా తెలీయదు : బాలకృష్ణ !

పవన్ కళ్యాణా.. అతను ఎవరో కూడా తెలీయదు : బాలకృష్ణ !

SHARE

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఎన్నో చేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ- బీజేపీ తరపున ప్రచారం చేసి వాళ్ళను అధికారంలోకి వచ్చేలా చేశారు. ఎంతో మంది ఎన్నో విమర్శలు చేస్తున్నా కూడా పవన్, టీడీపీకే తన మద్దతును ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇందుకుగాను ఎమ్మెల్యే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కు మంచి గుణపాఠం చెప్పారు.

పవన్ అభిమానులు, ఆయన మంచి కోరుకునే వ్యక్తులు చాలా మంది టీడీపీతో పొత్తు వద్దురా బాబు అని మొత్తుకున్నా కూడా పవన్ టీడీపీకే తన మద్దతును ప్రకటించాడు. దీనితో పవన్ కు ఇప్పుడు ఇలా జరగాల్సిందేలే అని చాలా మంది అనుకుంటున్నారు. కాగా, నందమూరి బాలకృష్ణ ను వైజాగ్ లో కొంతమంది విలేకరులు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తేవడం కోసం పవన్ కళ్యాణ్ జేఎఫ్ఎఫ్‌సీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాడు కాదా… పవన్ చేస్తున్నా ఈ పోరాటంపై మీ స్పందన ఏంటి అని అడగగా… ” పవన్ కళ్యాణా …. అతనెవరో కూడా నాకు తెలియదంటూ… ” ఘాటుగా సమాధానమిచ్చి బాలకృష్ణ వెంటనే అతని కార్లో ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇప్పడీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపొయింది.

పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ గతంలో ఇద్దరూ కలిసి ఫోటోలు కూడా దిగారు. అందులోను మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎవరో కూడా తెలియదనడంపై అందరూ ఆశ్చర్య పోతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ విజయం కోసం ఎంతో శ్రమించాడు. ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా టీడీపీ 2014లో అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు. అంతగా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ ను మరియు తమకు మిత్ర పక్షం పార్టీ అధినేత ఎవరో అనేది బాలకృష్ణకు తెలియకపోవడం విచిత్రమే.

కాగా, బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు బాలకృష్ణపై ఎంతో ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎవరో అనేది మీ బావ అయిన చంద్రబాబును అడుగు… చెబుతారు అని బాలకృష్ణపై పంచ్ లు వేస్తున్నారు. కాగా, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు కూడా గతం పవన్ కళ్యాణ్ అంటే ఎవరో కూడా తెలియదంటూ కామెంట్ చేసిన సంగతి మనకి తెలిసిందే.