Home రాజకీయాలు కేఈ శ్యాంబాబు, ఎస్‌ఐ నాగ ప్రసాద్‌కు దిమ్మతిరిగింది…

కేఈ శ్యాంబాబు, ఎస్‌ఐ నాగ ప్రసాద్‌కు దిమ్మతిరిగింది…

1609
SHARE

వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈకృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు షాక్‌ తగిలింది. ఆయనపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా డోన్ కోర్టు ఆదేశించింది.

నారాయణరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఈ శ్యాంబాబును ఒక పద్దతి ప్రకారం ప్రభుత్వం తప్పించే ప్రయత్నంచేసింది.

తొలుత నామమాత్రంగా కేసు పెట్టినా.. కేఈ శ్యాంబాబు పరారీలో ఉన్నారంటూ పోలీసుల ద్వారా చెప్పించింది. ఈయన మాత్రం దర్జాగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల కేఈ ఇంట జరిగిన ఒక కార్యక్రమానికి కేఈశ్యాంబాబు కూడా వచ్చారు.

ఆ సమయంలో ఆయనకు పోలీసులు రక్షణ కల్పించి మరీ చట్టాన్ని అవహేళన చేశారు. ఈ నేపథ్యంలో నారాయణరెడ్డి భార్య శ్రీదేవి కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. పోలీసులు, ప్రభుత్వం కలిసి కేఈ శ్యాంబాబును కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తోందని… వెల్దుర్తి ఎస్‌ఐ నాగ తులసీ ప్రసాద్‌ దగ్గరుండి మరీ నారాయణరెడ్డి హత్యకు అన్ని విధాలుగా సహకరించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీదేవి పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని నిర్ధారించింది. వెంటనే కేఈ శ్యాంబాబు, ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్, జెడ్పీటీసీ కప్పట్రాల బొజ్జమ్మపై కేసునమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.