Home రాజకీయాలు చంద్రబాబుకు జగన్ సవాల్ !

చంద్రబాబుకు జగన్ సవాల్ !

651
SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకి విపక్ష నేత , వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో సవాల్ ను విసిరారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన లోక్ సభ సభ్యులంతా కలిసి వారి వారి పదవులకు రాజీనామా చేద్దాం… అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామంటూ జగన్ ప్రకటించారు. జగన్ తన ట్విట్టర్ లోనే కాకుండా దీనిగురించి ప్రజాసంకల్పయాత్రలో కూడా మాట్లాడారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా చెయ్యడానికి సిద్ధమని, మరి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కూడా తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలని అన్నారు.

“రాష్ట్రానికి ప్రత్యేక హోదా చాలా అవసరం. ఇప్పుడు నిర్లిప్తంగా ఉంటే రాష్ట్రానికి ఏ ప్రయోజనం కలగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనం కోసం అందరూ కలిసి ఓ నిర్ణయంను తీసుకోవాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ప్రతి ఎంపీ రాజీనామా చేయాలి. వైసీపీ తీసుకున్న నిర్ణయంపై స్పందించి మీ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తారా ? లేక ఎప్పటిలానే ప్రత్యేక ప్యాకేజీ పేరుతొ అంరప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా ?” అంటూ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబును ప్రశ్నించారు.