Home రాజకీయాలు పవన్ మనోడే అంటున్నా బాబు… అంటే పవన్ ప్రజలకు చెప్పేవన్నీ అబద్దాలేనా !

పవన్ మనోడే అంటున్నా బాబు… అంటే పవన్ ప్రజలకు చెప్పేవన్నీ అబద్దాలేనా !

SHARE

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పక్క వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తానో తెలియదని, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేతకు అయితే అనుభవం ఉంది రాష్ట్రానికి ఏదోకటి చేస్తారని ఆయనకు తన మద్దతును ప్రకటించానని, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు. అందుకే తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి తన మద్దతును ప్రకటిస్తానో అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతుంటే…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ మనోడేనని చెబుతున్నారట. అవును… చంద్రబాబు నాయుడు పార్టీ మంత్రులతో మరియు నేతలతో పవన్ ను ఎవరూ ఏమి అనవద్దని, అతడు చేస్తున్న పోరాటంలో అర్ధం ఉందని.. కాబట్టి పవన్ విషయంలో మీరంతా జాగ్రత్తగా మాట్లాడాలని వాళ్ళకి సూచించారట. పవన్ ఏర్పాటు చేసిన జేఏసీ వలన మనకు ఎటువంటి నష్టం లేదని కూడా తెలిపారట.

చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పవన్ ఇంకా టీడీపీ నుండి బయటకి వచ్చినట్లు లేరని, టీడీపీ ఆడుతున్న డ్రామాలో పవన్ కూడా పాలు పంచుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. పవన్ ఇప్పుడు ప్రజలను మోసం చేయడానికి ఎప్పుడో ఒకసారి చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారే తప్ప అతను మాత్రం ఇంకా చంద్రబాబుకి తొత్తుగానే వ్యవహరిస్తున్నాడు.

దీనిని బట్టి చూస్తుంటే పవన్ ఎంతా చేసినా కూడా అది కేవలం ప్రజలను నమ్మిచడానికే… రాబోయే ఎన్నికల్లో కూడా పవన్ తన మద్దతును టీడీపీ కే ఇస్తాడనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు పాలనా చూసినా ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో అతనికి ఓటు వేయకూడదని అనుకుంటున్నారు. ఈ విషయంను తెలుసుకున్న టీడీపీ కూడా పవన్ ను ఇలా రంగంలోకి దింపుతోంది. ఈసారి కూడా పవన్ ను అడ్డుపెట్టుకొని ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది.