Home రాజకీయాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన చిరంజీవి !

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన చిరంజీవి !

9627
SHARE

దేశంలో ఇప్పుడు బీజేపీ హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనక్కి నెట్టి ముందుకెళ్లాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. దీనికోసం కాంగ్రెస్ పార్టీ పలు ప్రయత్నాలు చేస్తుంది. పలు వ్యూహాలను రచిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపుతోంది. దీనికి మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని, కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి కేంద్ర మంత్రి బాధ్య‌త‌లు నిర్వ‌హించిన చిరంజీవి గురించి మనకి తెలిసిన విషయమే. ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొనసాగుతున్నారు. ఎలా అయినా ప్రజలలో బీజేపీ పై తీవ్ర వ్యతిరేకతను తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిరంజీవి చేత ప్ర‌చారం చేయించేందుకు సిద్దమయ్యింది.

ప్రస్తుతం చిరంజీవి ఎంపీగా కొనసాగుతూనే సినిమాలలో కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే చిరంజీవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు కొంచెం దూరంగానే ఉంటున్నారు. బీజేపీ ని ఢీ కొట్టడానికి చిరు అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కర్ణాటక శాసనసభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ మరోసారి గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధుల త‌ర‌పున చిరుతో అక్కడ ప్రచారం చేయించనున్నారు.

కేవలం చిరంజీవితో మాత్రమే కాకుండా, సినీ నటి ఖుష్భు, ప్రియాంక గాంధీతో కూడా ప్రచారం చేయించనున్నారు. కాగా, ప్రియాంక గాంధీ ఇందుకు ఇంకా ఒప్పుకోలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.