Home సినిమా నివేదా ఎంత పని చేసిందో మీరు కూడా చూడండి !

నివేదా ఎంత పని చేసిందో మీరు కూడా చూడండి !

216
SHARE

నివేదా థామ‌స్ జెంటిల్ మెన్ చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. తన మొదటి సినిమాలోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత నివేదాకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. నిన్ను కోరి, జై లవకుశ లాంటి సినిమాలో స్టార్ హీరోల పక్కన టాప్ రోల్ లో హీరోయిన్ గా నటించింది.

ఆ రెండు సినిమాల తరువాత నివేదా ఇంకే సినిమాలో నటించలేదు. దీనితో ఖాళీగా ఉన్న సమయంలో ఏమి చేయాలో అర్ధం కాకా… నివేదా ప్రాణాంత‌క‌ర విన్యాసాలను చేస్తోంది. అవి కూడా మనుషులతో కాకుండా డిఫ‌రెంట్ స్టైల్ లో విష స‌ర్పాల‌తో ఈ విన్యాసాల‌ను చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నివేదా ఒక కొండచిలువతో ఆటలాడుకుంటూ… దానిని మేడలో వేసుకొని కొంచెం కూడా భయం లేకుండా దానితో ఆడుకుంటుంది.

అంతేగాకుండా ఆ కొండ చిలువ‌ను మెడ‌లో వేసుకుని వివిధ రకాలుగా ఫోటోలు తీయించుకొని వాటిని తన సోష‌ల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. నివేదా చేసిన ఈ పోస్టులపై ” ఓ మై గాడ్.. వాటిని ఎంత ఇష్టంగా పెట్టుకున్నావు… , వామ్మో… ఎంత ధైర్యంగా ఆ కొండచిలువను పట్టుకున్నావో.. “అంటూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.