Home రాజకీయాలు చింతమనేనికి పదవీగండం ఉంటుందా? టీడీపీ ఆయనపై చర్య తీసుకుంటుందా ?

చింతమనేనికి పదవీగండం ఉంటుందా? టీడీపీ ఆయనపై చర్య తీసుకుంటుందా ?

SHARE

సాధారణంగా సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం ఎవరికైనా రెండేళ్ల జైలు శిక్ష పడితే వారి పదవి ఆటో మాటిక్ గా పోతుంది. ఒకవేళ వారికీ కానీ వెంటనే బెయిల్ వస్తే మాత్రం అతని పదవి ఉంటుందో లేదో అనేదానిపై చర్చలు జరుగుతాయి. అయితే ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కానీ నేతలకు కానీ ఏదైనా శిక్ష పడితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ నేతలు కానీ గగ్గోలు పెట్టేవారు. వీరికి వత్తాసు పలుకుతూ పచ్చ మీడియా కూడా ఇలాంటి వార్తలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ ప్రచారం చేసేది.

కానీ, తమ పార్టీ అధినేత విషయానికొచ్చేసరికి టీడీపీ మాత్రం నోరుమూసుకుని కూర్చుంది. అంతేకాకుండా టీడీపీకి సంబంధించిన మీడియాలు కూడా చింతమనేని వార్తలను చాలా జాగ్రత్తగా కవర్ చేసి మరి ప్రచారం చేస్తున్నాయి. కాగా, 1996 నుంచి చింతమనేనిపై పలు కేసులు నమోదు అయ్యాయి. చింతమనేనిపై ఇప్పటికి కూడా 42 కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.

గతంలో మంత్రి వట్టి వసంతకుమార్ మరియు ఎంపీ కావూరి సాంబశివరావులపై చింతమనేని చేసిన దౌర్జన్యం కేసులో చింతమనేనికి ఇప్పుడు శిక్ష పడింది. చింతమనేని ఈ కేసు విషయంలో సుప్రీమ్ కోర్టుకు వెళ్లి ఈ కేసును కొట్టివేయించుకోగలిగితేనే అతనికి ఆయన పదవి ఉంటుంది. అలా కానీ యెడల చింతమనేనికి పదవి గండం ఉన్నట్లే. అయితే చింతమనేనిపై తెలుగుదేశం పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో లేక చూసి చూడనట్లు వదిలేస్తుందో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.