Home రాజకీయాలు టీడీపీ నాటకాలకు తెరదించుతున్న కేంద్రం !

టీడీపీ నాటకాలకు తెరదించుతున్న కేంద్రం !

SHARE

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని మీడియాలు తెలుగుదేశం వెర్ష‌న్ ను నెగిటీవ్ ను పాజిటీవ్ గా చెయ్యడంలో మంచి ముద్ర వేసుకున్న సంగతి మనకి తెలిసిందే. అయితే టీడీపీ మీడియాలను అంట కట్టే విధంగా ఇప్పుడు సోషల్ మీడియా రంగంలోకి దింగింది. నిజాల్ని నిజాలుగా చూయించడంలో సోషల్ మీడియా ఇప్పుడు ముందంజలో ఉంది.

దీనితో టీడీపీ మీడియాల కంటే సోషల్ మీడియా 100 రేట్లు ముందుకు దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కేంద్రంపై కానీ, బీజేపీ నేతలపై కానీ, మోడీ పై కానీ ఎటువంటి కామెంట్ చేసినా వాటిన్నిటిని సోషల్ మీడియా పోస్టు చెయ్యడంలో వీటిని బీజేపీ నేతలు సేకరించి అప్పటికప్పుడు కేంద్రంకు పంపుతున్నారు.

బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎదుగుతుందో అని టీడీపీ కావాలనే బీజేపీ పై లేనిపోని కామెంట్లు చేస్తూ.. టీడీపీ నాయకులూ నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి అసలు గుర్తింపు అనేదే రాకూడదని టీడీపీ నాయకులూ డ్రామాలు ఆడుతున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు అంటున్నారు.

టీడీపీ నేతలు బీజేపీ నేతలపై చేసే కామెంట్లన్నిటిని తాము పరిశీలిస్తున్నాం, వీటన్నిటిని కేంద్రానికి సంభందించిన ఓ కీలక నాయకుడికి అందిస్తున్నాం. మోడీపై ఎవరు ఎటువంటి కామెంట్లు చేసినా కూడా వాటిని కేంద్రంకు పంపుతున్నామని బీజేపీ నేతలు అంటున్నారు.

దీనితో టీడీపీ నేతలు చేసే నాటకాలకు త్వరలోనే తెర పడనుందని వారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని వేల కోట్ల రూపాయ‌ల నిధులను ఏపీకి ఇచ్చినా కూడా టీడీపీ, కేంద్రంపై ఎందుకు విమర్శలు చేస్తుందో అనేది మాకు అర్ధం కావడం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.