Home రాజకీయాలు టీడీపీ నేతల బండారాన్ని బయటపెట్టడానికి బీజేపీ రెడీగా ఉందట !

టీడీపీ నేతల బండారాన్ని బయటపెట్టడానికి బీజేపీ రెడీగా ఉందట !

SHARE

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు. సురేష్‌ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ… “మన రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయాలలో ఎన్నో రకాల డ్రామాలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావాలనే మిత్రపక్షమైన బీజేపీ పై విమర్శలు చేస్తూ తమ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు అన్ని తెలుసు. వారు టీడీపీ నాటకాలను నమ్మే పరిస్థితిలో లేరు” అని అన్నారు.

అనంతరం ఆయన ఎంపీ జేసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించి.. ” జెసి కేవలం తన అక్రమ ఆస్తులను మరియు అతని ట్రావెల్స్ ని కాపాడుకునేందుకే చంద్రబాబును పొగుడుతూ, వివిధ రకాల పార్టీలను మారుతూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. జెసి దివాకర్ రెడ్డి అంటేనే హింసా రాజకీయాలు, అక్రమార్జనలు. జెసి, చంద్రబాబు నాయుడు యొక్క మెప్పు కోసం ప్రకృతిని కొల్లగొడుతూ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

మాజీ కాంగ్రెస్‌ నేతలు అయిన గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు మరియు జెసి దివాకర్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీలోకి చేరి తెలుగు రాష్ట్రానికే చెడ్డ పేరు తీసుకొచ్చారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతల బండారాన్ని బయటపెట్టడానికి బీజేపీ రెడీగా ఉంది ” అని సురేష్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.