Home రాజకీయాలు సీఎం, మంత్రి ముడుపుల కోసమే ఇలా చేస్తున్నారా ?

సీఎం, మంత్రి ముడుపుల కోసమే ఇలా చేస్తున్నారా ?

SHARE

కేంద్రప్రభుత్వం విభజన చట్టంలో ఉత్తరాంధ్రాకి ఇచ్చిన హామీలను అమలు చెయ్యడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవొచ్చు. ఒకరకం చెప్పాలంటే.. ఇప్పుడు రాష్ట్రానికి ఇంతటి అన్యాయం జరగడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు జిల్లా మంత్రి అశోక్‌ గజపతి. మంత్రి అశోక్ గజపతి ఇటీవల అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలను నిర్వహించగలిగే సత్తా తన శాఖలోని ఏఏఐకి లేదని ప్రకటించారు. మంత్రి చేసిన ఈ ప్రకటన చాలా హాస్యాస్పదంగా ఉందని అందరూ అనుకుంటున్నారు.

కానీ, దేశంలోనే ముఖ్యమైన కోల్ కత్తా, చెన్నై ఎయిర్‌పోర్టులను ఏఏఐనే అద్భుతంగా నిర్వహిస్తోంది. చంద్రబాబు, అశోక్‌లు బోగాపురం విమానాశ్రయం విషయంలోప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారు. దీనిని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి అశోక్ గజపతి ఈ విమానాశ్రయంను ఎలా అయిన ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టి వారి వద్ద నుండి ముడుపులు అందుకోవాలని చూస్తున్నట్లు మనకు చాలా క్లియర్ గా అర్ధమవుతుంది.