Home రాజకీయాలు మన లైన్‌లోనే… పవన్‌ జేఎఫ్‌సీపై బాబు సంచలన వ్యాఖ్యలు

మన లైన్‌లోనే… పవన్‌ జేఎఫ్‌సీపై బాబు సంచలన వ్యాఖ్యలు

SHARE

పవన్‌ కల్యాణ్ నడుపుతున్న జేఎఫ్సీపై  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన ఆయన.. జేనసేనపై విమర్శలు చేయవద్దని ఆదేశించారు. పవన్ పోరాటంలో ఒక అర్థముందన్నారు బాబు.

పవన్‌ కల్యాణ్‌ టీడీపీ లైన్‌లోనే ఉన్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పవన్‌ కల్యాణ్ శ్వేతపత్రం అడిగితే సున్నితంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. జేఎఫ్సీ వల్ల టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

కేంద్రం నుంచి వచ్చిన నిధులపై వివరాలు ఇవ్వాల్సింది మాత్రం బీజేపీనేతలేనని చంద్రబాబు చెప్పారు. పవన్ కల్యాణ్‌ ప్రజల కోసమే కష్టపడుతున్నారని చంద్రబాబు ప్రశంసించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని.. అలా భయపడాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు.

బీజేపీపైనా మితిమీరి విమర్శలు చేయవద్దని చంద్రబాబు ఆదేశించారు. వైసీపీపై మాత్రం విరుచుకుపడాలని ఆదేశించారు. వైసీపీ రాజీనామాల వ్యవహారం ఒక డ్రామాగా విమర్శించాలని సూచించారు. పవన్‌ కల్యాణ్‌ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. గతంలో పోలవరం వివరాలను కూడా పవన్ కల్యాణ్ అడిగారని.. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు బాబు.