Home రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా లీక్ ఇదే !

ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా లీక్ ఇదే !

SHARE

వైఎస్సార్ సీపీ అధినేత, విపక్ష నేత అయిన జగన్ ఇటీవల ఎంపీలా రాజీనామా అంటూ ఓ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఈ ప్రకటన ప్రభావము బాగా పడినట్లుగానే ఉంది. అందుకేననుకుంటా చంద్రబాబు రాత్రికి రాత్రే కోర్ కమిటీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో తమ పోరాటం అనేది ఆగదని, ఇలానే కొనసాగుతుందని లీక్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలోని అమలు చేయాల్సిన హామీల కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తుంటే… హామీల అమలులో మాత్రం జాప్యం జరగుతోందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కోసం భూములు కూడా ఇచ్చాం. మనం కేవలం ఆ భూముల ప్రహరీ గోడల నిర్మాణానికి ఇచ్చినన్నీ నిధులను కూడా కేంద్రం ఆ సంస్థల భవనాల నిర్మాణానికి ఇవ్వడం లేదని అన్నారు. పనుల్లో కూడా చాలా జాప్యం జరుగుతోందని అన్నారు.

కేంద్రం ఇలానే చేస్తే వాటి నిర్మాణం పూర్తి కావడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. అందుకే మేము ఇప్పుడు ఇలా గొంతెత్తి పోరాడాల్సి వస్తుంది. మిత్రబంధం ఉన్నా కూడా మనం ఎక్కడా వెనుకాడడం లేదని, మనం రాష్ట్రము కోసమే పోరాడుతున్నామని చంద్రబాబు ఆ మీటింగ్ లో పేర్కొన్నారట.