Home రాజకీయాలు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి జైలుశిక్ష!

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి జైలుశిక్ష!

SHARE

తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలిచే వ్యక్తులలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి కూడా ఒకరు. ఎమ్మార్వో వ‌న‌జాక్షి పట్ల చింతమనేని వ్యవహరించిన తీరు ఎవరూ మరిచిపోలేనిది. ఈ విషయంపై ఇప్పటికి కూడా చింతమనేని పై ఏదొక వార్త హల చల్ చేస్తూనే ఉంటుంది. చింతమనేని తనకి మంత్రి పదవి రాలేదని తన ఎమ్మెల్యే పదవికి మరియు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యడానికి సిద్ధమయ్యారు.

కాగా, ఓ కేసులో ఎమ్మెల్యే చింత‌మ‌నేనికి కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. భీమ‌డోలు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో చింతమనేనికి మరియు అతని అనుచరులకు భారీ షాక్ కలిగింది. బుధవారం ఈ న్యాయస్థానం చింతమనేని మాజీ మంత్రిపై చేయి చేసుకున్న కేసులో సంచలన తీర్పును ఇచ్చింది. 2011 లో చింతమనేని ప్రభాకర్‌ అప్పటి కాంగ్రెస్ మంత్రి మరియు సీనియర్ నాయకుడు అయిన వట్టి వసంత్‌కుమార్‌పై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావుపైనా కూడా దౌర్జన్యానికి పాల్పడ్డాడు.

అప్పట్లో ఈ సంఘటన చాలా పాపులర్ అయ్యింది. ఈ సంఘటనపై వట్టి వసంత్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమడోలు మెజిస్ట్రేట్‌ కోర్టు ఈ కేసును విచారణ జరిపిన అనంతరం చింతమనేనికి ఆరు నెలల జైలు శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానాను కూడా విధించింది.