Home సినిమా ఎక్స్‌ప్రెషన్స్‌తో చావకొట్టిన సమంత !

ఎక్స్‌ప్రెషన్స్‌తో చావకొట్టిన సమంత !

298
SHARE

తమిళంలో విశాల్ మరియు సమంత జంటగా నటిస్తున్న సినిమా “ఇరంబుతిరై”. ఈ సినిమా తెలుగులో కూడా తెరకెక్కుతుంది. కాగా, ఈ సినిమా చిత్రబృందం ఈ సినిమాలో ” యాంగ్రీ బర్డ్” అనే సాంగ్ వీడియో ప్రోమోని రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాను షూటింగ్ చేస్తుండగా జరిగిన ఫన్నీ సన్నివేశాలను కూడా ఈ వీడియోకు జత చేశారు.

ఈ వీడియోలో సమంత ఎక్స్‌ప్రెషన్స్‌తో చావగొట్టింది. ఇక ఫన్నీ సన్నివేశాల విషయానికొస్తే విశాల్, సమంత ఎలా నడుస్తుందో అని అక్కడి చిత్ర బృందానికి చూయిస్తుంటాడు. అది చూసిన చిత్రబృందం మొత్తం నవ్వుల్లో మునిగిపోతారు. కాగా, ఈ సినిమా పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతంను అందిస్తున్నారు. ఈ సినిమాను విశాల్ ప్రొడక్షన్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.