Home రాజకీయాలు జెపి, చంద్రబాబుకు అనుకూలవాదిగా మారారా ?

జెపి, చంద్రబాబుకు అనుకూలవాదిగా మారారా ?

SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అనుకూలంగా లైన్ తీసుకుంటున్నట్లున్నారు. కేంద్రం వాదన, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, రాష్ట్రం ఖర్చు చేసిన నిధులలపై కేంద్ర, రాష్ట్ర వాదనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జెపి మరియు మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ కుమార్ లతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరందరూ సమావేశం కూడా అయ్యారు.

ఈ సమావేశం తరువాత జెపి మీడియాతో మాట్లాడుతూ… మన హక్కులను కాపాడుకునే భాద్యత మన అందరిపై ఉంది. రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప కలిగిన ప్రయోజనాలేమి లేవు” అని విమర్శించారు. జెపి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేసరికి ఇప్పుడందరిలో ఈ అనుమానం కలుగుతుంది. అంతేకాకుండా జెపి కొద్దీ రోజుల ముందు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వెళ్లిన తరువాత ఆయన మాట్లాడిన విషయాలపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

జెపి యుటిలైజేషన్ సర్టిపికెట్లు, ఇతర సాంకేతిక విషయాలను పట్టించుకోరాదని అనడంపై అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఒక మాజీ ఐఎఎస్ అయి ఉండి కూడా జెపి ప్రభుత్వాలు నిధులను వాటి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోవచ్చని అన్నారు . దీనితో జెపి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటిని చూస్తే జెపి, చంద్రబాబుకు అనుకూలవాదిగా మారారేమో అన్న సందేహాలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి.