Home రాజకీయాలు పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది !

పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది !

SHARE

బీజేపీ శాసనసభ పక్ష నేత జి.కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుందని అన్నారు. సినిమాలలో నటించడం కూడా సరిగా రాని వ్యక్తి రాజకీయ నాయకుడిగా ఎలా పనికొస్తాడు అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా పనికిరాడని వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడు పవన్ ఇచ్చే హామీలను, ఆయన హావభావాలను చూస్తుంటే నాకు నవ్వొస్తుంటుందని ఎద్దేవా చేశారు.

పవన్ సినిమాలలోకి కూడా తన సొంత టాలెంట్ తో ఏమి రాలేదు. తన అన్న అయిన చిరంజీవిని అడ్డుపెట్టుకొని హీరో అయ్యాడు. ఇప్పుడేమో మీడియా మద్దతుతో పొలిటిషన్ అవ్వాలని అనుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కంటే ఆయన అన్న కొడుకు అయిన రామ్ చరణే మంచి నటుడని వ్యాఖ్యానించారు. చివరికి మీడియా కత్తి మహేష్ లాంటి వాళ్ళని కూడా పైకి లేపుతుంది” కిషన్ రెడ్డి అన్నారు.