Home రాజకీయాలు గల్లా జయదేవ్‌ పై రోజా హాట్‌ కామెంట్స్

గల్లా జయదేవ్‌ పై రోజా హాట్‌ కామెంట్స్

SHARE

బడ్జెట్‌ విషయంలో టీడీపీ తీరు విచిత్రంగా ఉందన్నారు ఎమ్మెల్యే రోజా. ఎమ్మెల్యేలు ఏమీ రాలేదని గగ్గోలు పెట్టడం, టీడీపీ ఎంపీలు మాత్రం అన్నిసాధించేశామని సన్మానాలు చేయించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ కేంద్రం ఏమీ ఇవ్వలేదని బోడి గుండు కొట్టించుకుంటే .. మరో గుండాయన( గల్లా జయదేవ్‌) మాత్రం అన్ని సాధించేశామని సన్మానాలు చేయించుకుంటున్నారని విమర్శించారు.

గల్లా జయదేవ్‌ ఏం సాధించారని సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అవసరం లేదంటున్నప్పుడు మరి హోదా ఉన్న రాష్ట్రాల్లోనే గల్లా జయదేవ్‌ ఎందుకు పరిశ్రమలు పెట్టారని రోజా ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా జగన్‌ లాంటిదైతే.. ప్రత్యేక ప్యాకేజ్ ఎవరికీ పనికిరాని చంద్రబాబు ఇంట్లో పప్పులాంటిదని లోకేష్‌పై రోజా సెటైర్లు వేశారు. పదేపదే మీడియా ముందుకు వచ్చి వాట్ ఐయాస్ సేయింగ్ అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు మాత్రం మీడియా ముందుకు రాకుండా ఎందుకు లీకులిచ్చుకుంటున్నారని ప్రశ్నించారు రోజా.

ఓటుకు నోటులో దొరికినప్పుడు కూడా ఇదే తరహాలో చంద్రబాబు 16 రోజులు మీడియా ముందుకు రాకుండా దాక్కున్నారని.. ఇప్పుడు కూడా అదే చేస్తుండడం బట్టే చంద్రబాబు తప్పు చేశారన్నది నిర్ధారణ అవుతోందనిరోజా వ్యాఖ్యానించారు. పత్రికల్లో మాత్రం పళ్లు కొరికా, నిప్పులు కురిపించా అంటూ కథలు రాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.