Home రాజకీయాలు పవన్‌ ఒక సారి చెబితే అర్థం కాలేదా!

పవన్‌ ఒక సారి చెబితే అర్థం కాలేదా!

885
SHARE

2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిందంటే  అది తన దయేనన్న భావన పవన్ కల్యాణ్‌లో చాలా గట్టిగా ఉంది. చింతమనేని లాంటి టీడీపీ నేతలు మాత్రం సొంత అన్నను గెలిపించుకోలేని వాడు టీడీపీని గెలిపించారా అంటూ హేళన చేస్తుంటారు.

కానీ ఇప్పటికీపవన్ మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. తాజాగా కేంద్రం ఆఖరి బడ్జెట్‌ చూసి జనం పూర్తిగా మోసపోయామని ఏడుస్తుంటే పవన్‌ కల్యాణ్ మాత్రం ఎంత మేర మోసపోయారు.. మోగించింది ఎవరు?. మోసపోయింది ఎవరు?.. తేలుస్తా అంటూ  జేఎఫ్‌సీ తో ముందుకెళ్తున్నారు.

కేంద్రం ఏమీమి ఇచ్చింది.. ఆ నిధులతో ఏం చేశారో తనకు ఈనెల 15లోగా రాష్ట్రప్రభుత్వం వివరాలను ఇవ్వాలని పవన్‌ ఇటీవల మిత్రపూరితమైన డిమాండ్ చేశారు.

పవన్‌ డిమాండ్‌కు చంద్రబాబు స్పందిస్తారా అని ఎదురుచూస్తున్న వేళ… పవన్‌ కల్యాణ్ అడిగినట్టు వివరాలు ఇచ్చే పరిస్థితే లేదని చంద్రబాబు పరోక్షంగా తేల్చేశారు.

టీడీపీ కోర్‌ కమిటీ భేటీలో పవన్‌ డిమాండ్ ప్రస్తావనకు రాగా చంద్రబాబు లైట్ తీసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ గతంలో పోలవరంపైనా శ్వేతపత్రం అడిగారని..  ఆ వివరాలను అసెంబ్లీలో ప్రకటించాం.. వెబ్‌సైట్‌లో పెట్టాం వెళ్లి చూసుకోండి అని చెప్పాం కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పరోక్షంగా ఇప్పుడు కూడా వెళ్లి వెబ్‌సైట్లలో వివరాల కోసం వెతుక్కోండి అని చంద్రబాబు తేల్చేశారు. అంతేకాదు.. జేఎఫ్‌సీకి కొన్ని సూచనలు కూడా చేశారు చంద్రబాబు.

నాలుగేళ్లుగా కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో నిజనిర్ధారణ కమిటీ పరిశోధన చేయాలి… ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏంచేసిందన్నది పరిశోధించాల్సిన అంశం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికే ప్రచురించింది. కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన వాటిపై ఫోకస్‌ పెట్టాలి తప్ప రాష్ట్రం ఇప్పటి వరకు వచ్చిన నిధులతో ఏం చేసిందన్న దానిపై ఫోకస్ పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటని చంద్రబాబు పవన్ కల్యాణ్ జేఎఫ్సీని ప్రశ్నించినట్టు సదరు పత్రిక వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగానే పనిచేసి ఉంటే కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన లెక్కలతో పాటు .. ఇప్పటి వరకు వచ్చిన నిధులను ఏంచేశామో చెప్పేందుకు సిద్ధమని ప్రకటించాలి.

అలా కాకుండా పవన్‌ కల్యాణ్ జేఏఫ్‌సీ.. కేవలం కేంద్రం ఏం ఇచ్చిందన్న దానిపై పరిశోధన చేయాలని… నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏంచేసిందన్న దానిపై ఫోకస్ పెట్టకూడదని చెప్పడం ద్వారా ఏఎఫ్‌సీపై చంద్రబాబు తన కమాండ్ ను నిరూపించుకున్నారు.

చూడాలి… పవన్‌ కల్యాణ్ ఇచ్చిన గడువు గురువారంతో ముగిసిపోనుంది. రాష్ట్రం ఎలాగో అధికారికంగా వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతున్న వేళ పవన్‌ కల్యాణ్.. ఏం చేస్తారో!. ఈసారి కూడా పోలవరంపై శ్వేతపత్రం అడిగితే అందుకు చంద్రబాబు అంగీకరించకపోయినా పల్లెత్తు మాట అనకుండా మౌనంగా ఉన్నట్టుగానే ఈసారి ఉంటారో లేక ఇదేంటని ప్రశ్నిస్తారో చూడాలి.