Home రాజకీయాలు చంద్రబాబు ఇక చివరిగా ఈ ప్రయత్నం చేస్తున్నారా ?

చంద్రబాబు ఇక చివరిగా ఈ ప్రయత్నం చేస్తున్నారా ?

278
SHARE

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఇటీవల టీడీపీ మరియు బీజేపీ ల మధ్య తీవ్రమైన విభేదాలు చోటుచేసుకోవడమే కాకుండా, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులూ అంటుంటే, బీజేపీ నాయకులేమో కేంద్రం ఇచ్చిన నిధులను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వృధా చేస్తుందని అంటూ తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు రంగంలోకి దిగారు. అందుకే ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. బాబు ఢిల్లీకి వెళ్లి ఆర్ధికమంత్రి అయిన అరుణ్ జైట్లీని మరియు అమిత్ షా తదితరులతో భేటీ అవుతారట. ఈ భేటీలో చంద్రబాబు అసెంబ్లీ సీట్ల పెంపుపై తన చివరి ప్రయత్నంను చేస్తారేమో అని చాలా మంది అంటున్నారు. అయితే చంద్రబాబు రాష్ట్రంలో స్వాతంత్ర పోరాటం చేస్తానంటూ మీడియాకు లీకులు ఇచ్చి… ఇప్పుడు జైట్లీ, అమిత్ షా లను కలవడం ఎందుకో మరి ?