Home సినిమా మా సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తాం !

మా సినిమా చూసి నచ్చలేదన్నవారికి డబ్బులు వాపసు ఇచ్చేస్తాం !

SHARE

ప్రభాస్‌ దర్శకత్వంలో సాత్విక ఈశ్వర్ హీరోగా మరియు అక్షిత హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ” సత్య గ్యాంగ్‌”. సొసైటీలో ఎక్కడా అనాధలనే వారు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా కథను రూపొందించారు. ఈ కథకి కొంచెం వినోదం కూడా జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను మహేశ్‌ ఖన్నా నిర్మించారు.

ఈ సినిమా యొక్క టీజర్ ను కూడా అనాధ బాలల చేత విడుదల చేయించారు. ఇందుకు గాను మహేష్ ఖన్నా అన్ధబాలలకు 10 వేల రూపాయలను ఆర్థిక సాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… “ఓ మంచి కథతో ఈ సినిమాను రూపొందించాం. మా సినిమాను చూసిన తరువాత ఎవరైనా సినిమా నచ్చలేదు అని అంటే వారికీ డబ్బులు వాపసు ఇచ్చేస్తాం. ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెబుతున్నామంటే ఈ సినిమా పట్ల మాకున్న నమ్మకం అంతగా ఉంది. తొందరలోనే ఈ సినిమా యొక్క ఆడియో లాంచ్‌ కూడా చేస్తాం” అని అన్నారు.