Home రాజకీయాలు ఏపీలో అవినీతి, దుబారా పెరగడం వలనే… ఏపీకి కేంద్రం సాయం చేయట్లేదట !

ఏపీలో అవినీతి, దుబారా పెరగడం వలనే… ఏపీకి కేంద్రం సాయం చేయట్లేదట !

1354
SHARE

ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ లో విచ్చల విడిగా అవినీతి పెరగడం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం వలనే ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం లేదని పేర్కొన్నారు. ఐవైఆర్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో కేవలం జగన్ మాత్రమే ప్రత్యేక హోదాపై పోరాడుతున్నాడని అన్నారు. ప్రత్యేక హోదాను తెలుగుదేశం పార్టీ గాలికొదిలేసిందని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సీట్లను పెంచడం లేదని హడావిడి చేస్తుందే తప్ప ఇంకేమి లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ డ్రామాలు సరైనవి కాదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు సాధించింది ఏమి లేకపోయినా వారే సాధించామన్నట్లు చెప్పుకుంటూ సన్మానాలు చేయించుకుంటున్నారని ఐవైఆర్ మండిపడ్డారు.