Home సినిమా క్లారిటీ ఇచ్చేసిన కట్టప్ప కూతురు !

క్లారిటీ ఇచ్చేసిన కట్టప్ప కూతురు !

189
SHARE

సత్యరాజ్ బాహుబలి చిత్రంతో కట్టప్పగా మారిపోయాడు. చిన్నపిల్లలతో సహా ఇప్పుడు అందరూ సత్యరాజ్ ను చూడగానే కట్టప్ప అని అంటుంటారు. అంతేకాదు అన్ని సినీ ఇండస్ట్రీలకు సత్యరాజ్, కట్టప్పగానే తెలుసు. సత్యరాజ్ ను బాహుబలి చిత్రం అంతలా మార్చేసింది. అయితే ఇప్పుడు సత్యరాజ్ కొడుకు కూడా కోలీవుడ్ లో ఓ మంచి హీరోగా దూసుకుపోతున్నాడు.

దీనితో చాలా మంది సత్యరాజ్ కూతురు కూడా త్వరలోనే సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్ లో సంచరిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సత్యరాజ్ కూతురు “దివ్య సత్యరాజ్ ” ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. ఆ ప్రెస్ నోట్ లో ” నాకు అసలు నటనపై ఎటువంటి శ్రద్ధ కానీ ఆసక్తి కానీ లేదు.

నేను హీరోయిన్ గా నటించబోతున్నాను అని వార్తలు వస్తున్నాయి. మీరెవరూ వాటిని నమ్మొద్దు. నేను గత 7 సంవత్సరాల నుండి న్యూట్రిషియనిస్ట్‌‌గా చేస్తున్నాను. ఇందులో నేను పిహెచ్‌డి పూర్తిచేసి పట్టాతీసుకోవాలనేది నా కోరిక ” అంటూ దివ్య సత్యరాజ్ తెలిపింది. ఈ ప్రెస్ నోట్ తో దివ్య అందరికి ఓ క్లారిటీ ని ఇచ్చేసింది.