Home సినిమా నా ప్రేమలో నేను మునిగిపోతున్నా… : తమన్నా !

నా ప్రేమలో నేను మునిగిపోతున్నా… : తమన్నా !

251
SHARE

మాములుగా ప్రతి సెలబ్రెటీ “నేను విజయం కలిగినప్పుడు పొంగిపోను… అపజయాలు కలిగినప్పుడు కృంగిపోను” అని చెబుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే వినయంగా ” ఈ విజయం నా ఒక్కరిదే కాదు… మన అందరిదీ ” అంటూ చెప్పుకుంటారు. కానీ తమన్నా మాత్రం కొత్తగా ” మీ విజయాలకు మీరే కారణం… కాబట్టి ఈ విషయంను గుర్తుంచుకోండి ” అంటూ చెబుతుంది.

“ఒకప్పుడు నేను ఓటమికి పూర్తి భాద్యతను తీసుకునే దానిని. అదే ఒకవేళ విజయం వరిస్తే మాత్రం ‘అందులో నేను చేసిందేముంది ‘ అని అనుకునేదానిని. దీనితో నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లేది. మీరు అలా ఉండకండి. మీ విజయాలకు మీరే కారణం. మీరు ఏ చిన్నది సాధించినా కూడా పొంగిపోండి. మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్ళ కంటే ఎక్కువగా ప్రేమించుకోండి.

నేను ఇప్పుడు చేస్తుంది అదే. నాకొచ్చిన ప్రతి చిన్న విజయాన్ని నేను ఆస్వాదిస్తున్నా. నా ప్రేమలోనే నేను పూర్తిగా మునిగిపోతున్నా. ఇలా చేస్తుండడం వలన నాలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ” అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.