Home సినిమా టీడీపీ ఎంపీల వేషాలపై రామ్ గోపాల్ వర్మ ట్విట్ లు !

టీడీపీ ఎంపీల వేషాలపై రామ్ గోపాల్ వర్మ ట్విట్ లు !

SHARE

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, డిల్లీలో తెలుగుదేశం ఎంపీలు అసహ్యకరమైన రీతిలో వేషాలు వేయడంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా వర్మ టీడీపీ ఎంపీలను ఉద్దేశించి ట్విట్ లు చేశారు. “ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి జోకర్లు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్నా.. వీరు జోకర్లకు తక్కువ…. బహుశా వీరి వేషాలను చూసే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ని ఓ జోక్ గా భావిస్తున్నడనుకుంటా” అని వర్మ ట్విట్ చేశారు.

అంతటితో ఆగని వర్మ మరో ట్విట్ చేశారు . “టీడీపీ కి చెందిన వీరు ఇలాంటి జోకర్ల వేషాలు వేసి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగుదేశం పార్టీ పరువును తీసి, జాతీయస్థాయిలో తెలుగు దేశం పార్టీని అవమానానికి గురి చేస్తున్నారు ” అని వర్మ వ్యాఖ్యానించారు. వర్మ ట్విట్ లను చూసిన చాలామంది టీడీపీ ఎంపీలు వేసే వేషాలకు వర్మ ట్విట్ లు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయని అనుకుంటున్నారు.