Home రాజకీయాలు ఉండవల్లికి దూరంగా ఉంటేనే పవన్ కు మంచిది : టీడీపీ !

ఉండవల్లికి దూరంగా ఉంటేనే పవన్ కు మంచిది : టీడీపీ !

SHARE

పవన్, ఉండవల్లిల భేటీపై మండిపడ్డ టీడీపీ !

మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ్ కుమార్ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ల భేటీపై టీడీపీ మండిపడింది. టీడీపీ నేత, మంత్రి కెఎస్ జవహర్ వీరిద్దరి భేటీ గురించి మాట్లాడుతూ… మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ్ కుమార్ ది దృతరాష్ట్ర కౌగిలి అనే విషయాన్నీ పవన్ కళ్యాణ్ గుర్తించాలని ఆయన పవన్ కు సూచించారు. పవన్ కళ్యాణ్ ప్రజా శ్రేయస్సు కోరే వ్యక్తి అని, అటువంటి వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలని, అలా ఉంటే పవన్ కే మంచిదని అన్నారు.

అంతేకాకుండా ప్రజల పట్ల టీడీపీ ప్రభుత్వం ఎంతో శ్రద్దగా, పారదర్శకంగా పని చేస్తోందని అన్నారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ వెబ్ సైట్‌‌లో ఉంటాయని… కావాలంటే వీటిని మీరు చూసుకోవచ్చని ప్రజలకి ఉచిత సలహాను ఇచ్చారు. ఉండవల్లి ప్రభుత్వంపై తప్పుడు నిందలు వేస్తున్నాడని … కాబట్టి ప్రజలతో పాటుగా ఉండవల్లి కూడా నిర్భయంగా ప్రభుత్వ లెక్కలు అన్నిటిని చూసుకోవచ్చని జవహర్ అన్నారు.