Home సినిమా పూరి ” మెహబూబా” సినిమాకి అదిరిపోయే విధంగా వస్తున్న రెస్పాన్స్‌ !

పూరి ” మెహబూబా” సినిమాకి అదిరిపోయే విధంగా వస్తున్న రెస్పాన్స్‌ !

SHARE

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో, లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా ” మెహబూబా”. ఈ సినిమాలో హీరోగా పూరి జగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌ పూరి నటిస్తున్నాడు. ఈ సినిమాకు సందీప్‌ చౌతా సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ సినిమాను 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు.

ఈసినిమా యొక్క టీజర్ ను ఫిబ్రవరి 9న విడుదల చేశారు. ఈ టీజర్‌ ఆంధ్రపద్రేశ్‌, తెలంగాణ, యు.ఎస్‌.లలో మొత్తం 500 థియేటర్లలో విడుదలైంది. ఈ టీజర్ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉండడంతో ప్రేక్షకులందరి నుండి తెగ రెస్పాన్స్‌ వస్తోంది. అంతేకాకుండా ఈ టీజర్‌కి సోషల్‌ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లోనే చాలా కొత్తగా, డిఫరెంట్‌ గా తెరకెక్కనుంది. ఈ సినిమాను వేసవిలో చాలా గ్రాండ్ గా విడుదల చేయాలనీ ఈ సినిమా చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.