Home రాజకీయాలు పార్లమెంటులో టీడీపీ నేతల ఆందోళన వెనుక బేరసారాలు జరుగుతున్నాయి !

పార్లమెంటులో టీడీపీ నేతల ఆందోళన వెనుక బేరసారాలు జరుగుతున్నాయి !

SHARE

సిపిఎం నేత ప్రకాశ్ కారత్ భీమవరంలో జరిగిన పార్టీ మహాసభలలో మాట్లాడుతూ… తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు సంభందించిన హామీలను పట్టించుకోకుండా నాలుగేళ్లుగా నిద్రపోయి… అకస్మాత్తుగా ఇప్పుడు నిద్ర లేచి పార్లమెంట్ లో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏదో చేస్తుంది అని ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే… టీడీపీ మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నిద్రపోయిందని అన్నారు.

వామపక్ష పార్టీలు రాష్ట్రా విభజన మొదట్నుంచి ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని అంశాలన్నిటిని అమలుచేయాలని డిమాండ్ చేస్తూనే వచ్చాయి. కానీ టీడీపీ మాత్రం ఇప్పడు ఎవరూ కలిసి రావడం లేదంటూ అడుగుతుంది. అసలు టీడీపీ ఇప్పుడు ఇలా ఎలా అడగగల్గుతుంది? నాకెందుకో పార్లమెంట్ లో టీడీపీ నేతలు చేసే ఆందోళన వెనుక ఏమైనా బేరసారాలు జరిగి ఉండవచ్చు అనే అనుమానం కలుగుతుందని ” అని ప్రకాశ్ కారత్ అన్నారు.