Home రాజకీయాలు పవన్‌ కల్యాణ్‌ ఎజెండా ఏంటో అసలు అర్థం కావడం లేదు : వైసీపీ !

పవన్‌ కల్యాణ్‌ ఎజెండా ఏంటో అసలు అర్థం కావడం లేదు : వైసీపీ !

643
SHARE

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక ప్రశ్నను సంధించింది. ఎమ్మెల్యే,పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ కూటమి నుండి పవన్ కళ్యాణ్ బయటకు ఎప్పుడు వచ్చారని ప్రశ్నించారు. ఆయనని పవన్ కళ్యాణ్ జేఏసీ ప్రతిపాదన గురించి ప్రశ్నించగా… అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఇంకా టీడీపీ తోనే కలిసి ఉన్నారని మేము భావిస్తున్నామని అన్నారు.

అంతేకాకుండా పవన్ ఇటీవల చేపట్టిన పాదయాత్రలో భాగంగా అనంతపురం వెళ్ళినప్పుడు అక్కడ కేవలం టీడీపీ ఎమ్మెల్యే ల ఇంటికి మరియు మంత్రి పరిటాల సునీత ఇంటికి మాత్రమే వెళ్లారని అన్నారు. ఎక్కడా కూడా వైసీపీ ఎమ్మెల్యే ల ఇంటికి వెళ్లలేదని అన్నారు. ఒకవేళ అక్కడేమైనా వివరాలను తెలుసుకోవాలనుకుంటే పవన్ డైరెక్ట్ గా జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళాలి కానీ, అలా టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్ళేదేంటి అని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ టీడీపీ నుండి బయటకు వచ్చిన తరువాత ఆయన గురించి ఆలోచిస్తామని అన్నారు. పవన్ ఒకవేళ నిజంగా జేఏసీ ఏర్పాడాలి అని అనుకుంటే ముందుగా అందులోకి టీడీపీ రావాలని అన్నారు. అసలు రాష్ట్రములో పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటో అనేది ఇప్పటికీ కూడా అర్ధం కావడం లేదని బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి అన్నారు.