Home రాజకీయాలు టీడీపీతో పొత్తు వదలుకుంటే బీజేపీకి పుట్టగతులు ఉండవట !

టీడీపీతో పొత్తు వదలుకుంటే బీజేపీకి పుట్టగతులు ఉండవట !

SHARE

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ… బీజేపీకి ఇప్పుడే వేరే దారేమి లేదని, ప్రస్తుతం బీజేపీ డౌన్ లో ఉందని, ఈ సమయం లో బీజేపీ కానీ టీడీపీతో పొత్తు వదులుకుంటే బీజేపీకి ఇక పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ విషయంలో జరిగిన అన్యాయంపై కేంద్రమంత్రులు వచ్చి ఏదో మాట్లాడి వెళ్తున్నారు, ఇక బీజేపీ నేతలు ఏమో హరికథ చెప్పి వెళ్తున్నారే తప్ప వారినుండి ఎటువంటి కమిట్ మెంట్ రావడం లేదని అన్నారు.

తమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు సరైన ఆదేశాలను ఇచ్చి మమ్మల్ని నడుపుతున్నారని అన్నారు. ఆయన ఆదేశాలతోనే సభ జరగకుండా చూశామని అన్నారు. వారికీ రాజ్యసభలో ఆర్దిక బిల్లు అనే ఇబ్బంది ఉండదు కాబట్టే వారు సులభంగా చేతులు దులుపేసుకొని పోతారని అన్నారు. మాకు కానీ చంద్రబాబు గుడ్ బై చెప్పాలని ఆదేశమిస్తే తాము గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతామని అన్నారు. చూస్తుంటే తమకు బీజేపీ కి గుడ్ బై చెప్పడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఏమి కనిపించడం లేదని అన్నారు.

తమకు అందరిలా మాటలు చెప్పడం రాదని, ఏదైనా చేసి చేయిస్తామని, మేమంతా చేతులలోనే ఉంటామని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వకపోతే ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తామని వెంకటేష్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తే లాభం ఉంటుంది కానీ, రాజీనామాలు చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు.