Home సినిమా సంచ‌ల‌నంగా మారిన ర‌కుల్ హాట్ ఫోటో షూట్ !

సంచ‌ల‌నంగా మారిన ర‌కుల్ హాట్ ఫోటో షూట్ !

SHARE

ర‌కుల్ ప్రీత్ సింగ్ మొదట తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించేటప్పుడు కాస్త పద్డతిగానే కనిపించింది. కానీ, బాలీవుడ్‌లో ఎప్పుడైతే సినిమాలు చేయ‌డం మొదలుపెట్టిందో అప్పటి నుండి రకుల్ ఆలోచనా విధానం కొంచెం మారినట్లుగా కనిపిస్తుంది. బాలీవుడ్ సినిమాలలో నటించడం మొదలుపెట్టిన తరువాత రకుల్ తన గ్లామర్ ను ప్రదర్శించడానికి ఎక్కడా కూడా తగ్గడం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన బాలీవుడ్ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయి విడుదలకు సిద్ధంగా ఉంది.

బాలీవుడ్ లో ఈ ఒక్క సినిమాలోనే కాకుండా ఇంకా మరిన్ని సినిమాలతో అక్కడ దూసుకుపోవాలని రకుల్ అక్కడి మేగ‌జీన్‌ల కోసం హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తోంది. ఈ ఫోటోషూట్లలో రకుల్ ఎక్కడా కూడా వెనుకాడకుండా తన అందాలను ఆరపోస్తుంది. ఈ నేపథ్యంలో రకుల్ ఇటీవల ఓ “మాగ్జిమ్” కోసం చేసిన ఫోటోషూట్ మరింత సంచలనంగా మారింది. ఈ ఫోటోషూట్ అంత హాట్ హాట్ గా ఉంది మరి.

ఈ ఫోటోషూట్ అనంతరం రకుల్ ఈ మేగ‌జీన్‌కు ఇంట‌ర్వ్యూ ఇస్తూ… తనకు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉందొ తెలిపింది. “డేటింగ్ చేస్తే క‌నీసం ఆర‌డుగుల పొడ‌వు ఉండే వ్యక్తితో చేస్తానని, నేను అలాంటి వ్యక్తినే ఇష్టపడతానని, అంత హైట్ ఉన్న వ్యక్తినే తాను పెళ్లి చేసుకుంటానని” రకుల్ తెలిపింది.