Home సినిమా నా కొడుకుని వృద్ధాశ్రమానికి పంపుతున్నా : అమితాబ్ !

నా కొడుకుని వృద్ధాశ్రమానికి పంపుతున్నా : అమితాబ్ !

254
SHARE

అవును… అమితాబ్ తన కొడుకుని వృద్ధాశ్రమానికి పంపబోతున్నారు. అదేంటి ? అమితాబ్ కొడుకు అభిషేక్ వృద్ధుడేంటి ? అయినా అమితాబ్ అసలు అభిషేక్ ని ఎందుకు వృద్ధాశ్రమానికి పంపబోతున్నారు ? అని అనుకుంటున్నారా ? దీనిని చూసిన వారికీ మరియు దీనిని విన్న వారిలో చాలా మందికి ఇవే సందేహాలు ఉన్నాయి. వీటికి అమితాబ్ సమాధానమిస్తూ… ఇది నా 102 నాట్ అవుట్ సినిమాలో నేను చెప్పే డైలాగ్. నా పాత్రకి ఈ సినిమాలో 102 ఏళ్ళు” అని సమాధానమిచ్చారు.

కాగా, ఈ సినిమాలో అమితాబ్ కు కొడుకుగా రిషీ కపూర్ నటించారు. రిషీ వయస్సు 75 ఏళ్ళు ఉంటుంది. శుక్రవారం ఈ సినిమా యొక్క టీజర్ కూడా విడుదల అయింది. ఈ టీజర్ లో ” దేశంలో ఎన్నడూ లేని విధంగా కుమారుడిని వృద్ధాశ్రమానికి పంపే తొలి తండ్రిని నేనే అవుతా ” అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ తో అమితాబ్ ప్రేక్షకులందర్నీ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాల్లో తండ్రి కొడుకులుగా అమితాబ్, రిషీల కామెడీ బాగా పండింది.

అమితాబ్, రిషి కలిసి మరల 27 ఏళ్ళ తరువాత ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఉమేష్ శుక్లా డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయాలని ఈ సినిమా చిత్ర బృందం అనుకుంటుంది.