Home సినిమా నా కోరిక అదే : నికిషా !

నా కోరిక అదే : నికిషా !

SHARE

పవన్ కళ్యాణ్ సరసన “పులి” అనే చిత్రంలో నటించి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నటి నికిషా పటేల్. పులి సినిమా తరువాత నికిషా “తలైవన్” అనే సినిమాతో తమిళంలో పరిచయమయ్యారు. ఇక ఆ తరువాతి నుండి నికిషా వెనక్కి తిరిగి చూసుకోకుండా వరసగా ” ఎన్నమో ఏదో”, “కరైయోరం”, “నారదన్‌”, “7 నాట్కల్‌” అనే సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఇప్పుడు ఈ అమ్మడు తాను నటించిన సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ… తనకి తమిళంలో మంచి గుర్తింపు వచ్చిందని చెబుతుంది.

తనకి కొన్ని సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి అని చెప్పింది. కానీ తాను మాత్రం మంచి గుర్తింపు వచ్చే కదా కోసం వేచి ఉందట. నికిషా ఇంకా మాట్లాడుతూ… ” నాకు బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. నేను బాక్సింగ్ క్రీడాకారిణి. అందుకే క్రీడల నేపథ్యంలోని సినిమాల్లో నటించాలని అటువంటి కథల కోసం ఎదురుచూస్తున్నా.

ఈ సమయంలోనే తెలుగులో ఇటీవల ఓ అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నేను అనుకుంటున్నట్లుగానే యాక్షన్ పాత్ర పోషిస్తున్నా. అలానే తమిళంలో కూడా యాక్షన్ పాత్రలనే ఎంచుకుందామని అనుకుంటున్నా. అందుకే వాటికీ తగ్గ కథలను ఎంపిక చేసుకుంటున్నా ” అని చెప్పుకుంటూ వచ్చింది.