Home రాజకీయాలు చంద్రబాబును జైలుకు పంపితే…ఆయనపై సానుభూతిని ఓట్ల రూపంలో చూపిస్తారు !

చంద్రబాబును జైలుకు పంపితే…ఆయనపై సానుభూతిని ఓట్ల రూపంలో చూపిస్తారు !

SHARE

బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ… ఓ టీవీ ఛానెల్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను పదవీచిత్యుడిని చేసిన సమయంలో చూయించినంత ధైర్యం లో కనీసం పదోవంతు అయినా ఇప్పుడు చూయిస్తే మోడీ ప్రభుత్వం పడిపోవడం కచ్చితమని అన్నారు.

బీజేపీకి పార్లమెంట్ లో పూర్తి మెజారిటీ లేదని, ఎందుకంటె శతృఘ్నసిన్హా, యశ్వంత్ సిన్హా లాంటి నేతలు ఇప్పటికే బీజేపీపై వ్యతిరేఖంగా గ్రూపులను నడుపుతున్నారని తెలిపారు. అంతేకాకుండా బీజేపీకి శివసేన లాంటి పార్టీలు కూడా దూరమై పోయాయని అన్నారు. మోడీ ప్రభుత్వంపై రాజస్థాన్ ఉపఎన్నికల ఫలితాల అందరికి నమ్మకం పోయిందని అన్నారు.

శివసేన, అకాలీదళ్ లు కూడా బీజేపీ విషయంలో వెనక్కు తగ్గాయని, వాటిలానే టీడీపీ కూడా ఇప్పుడు తన మద్దతును ఉపసంహరించుకుంటే మంచిదని, ఇందుకోసం టీడీపీకి ఇంతకంటే మంచి సమయం ఇంకొకటి ఉండదని అన్నారు. టీడీపీ కానీ ఇలా చేస్తే నితీష్ లాంటి వారు ఆలోచనలో పడతారని ఉండవల్లి అన్నారు.

చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయడంతో ఎందుకంత భయపడుతున్నారా అనేది అర్ధం కావడం లేదని, చంద్రబాబు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లే అంత పెద్ద తప్పేమి ఆయన చేయలేదని అన్నారు. కేంద్రం ఒకవేళ చంద్రబాబుపై కక్షసాధింపుల చర్యలను చేపట్టి ఆయనను జైలుకు పంపినా.. ప్రజలు చూస్తూ ఏమి ఊరుకోరని.. చంద్రబాబుపై సానుభూతితో అందరూ చంద్రబాబుకే ఓటు వేసి అతనిని గెలిపిస్తారని అన్నారు. జగన్ విషయంలో కూడా గతంలో ఇదే జరిగిందని అన్నారు. ఉప-ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతిని ఉండవల్లి మరో సారి గుర్తుచేశారు.